ఒక్క రోజే దిల్ రాజు 5 సినిమాలు..అది కూడా ఈ సమయంలో.!

ఇప్పుడు మన టాలీవుడ్ లో ఉన్నటువంటి టాప్ మోస్ట్ నిర్మాతలలో దిల్ రాజు కూడా ఒకరు. లేటెస్ట్ గా దిల్ రాజు చేసుకున్న 50 వ పుట్టినరోజు వేడుకలు అయితే ఇతర ఇండస్ట్రీ వర్గాల్లో కూడా మంచి హాట్ టాపిక్ గా నిలిచింది. అయితే మన టాలీవుడ్ లో అత్యధిక హిట్ పర్సెంట్ ఉన్న నిర్మాతల జాబితాలో కూడా దిల్ రాజు పేరు ఉంటుంది.

అంటే ఆ రేంజ్ లో దిల్ రాజు సెలక్షన్ మరియు కమిట్మెంట్ కనిపిస్తాయి. ఇక ఇదిలా ఉండగా ఈ కరోనా సమయంలో దిల్ రాజు ఒక అరుదైన ఫీట్ నే సెట్ చేసారు. ఈ ఒక్కరోజే దిల్ రాజు నిర్మాణం వహిస్తున్నటువంటి 5 చిత్రాల షూటింగ్ జరుపుకోవడం గమనార్హం.

వాటిలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో చేస్తున్న “వకీల్ సాబ్”, లేటెస్ట్ గానే స్టార్ట్ చేసిన ఎంటెర్టైనర్ “ఎఫ్ 3”, నాగ చైతన్య “థ్యాంక్ యూ”, అలాగే “హుషారు” ఫేమ్ హర్ష తెరకెక్కిస్తున్న ఓ చిత్రం వీటితో పాటుగా “పాగల్” అనే మరో చిత్రం. ఇలా మొత్తం 5 సినిమాలు ఒకే రోజు సెట్స్ లో ఉన్నాయి. దీనితో ఇలాంటి ఫీట్ అందులోను ఈ కష్ట కాలంలో ఒక్క దిల్ రాజు బ్యానర్ కే దక్కింది అని చెప్పాలి.

Exit mobile version