సూర్య సినిమా కోసం అందరికీ పరీక్ష పెట్టారట !

సూర్య సినిమా కోసం అందరికీ పరీక్ష పెట్టారట !

Published on Nov 4, 2020 1:01 AM IST


హీరో సూర్య చేసిన కొత్త చిత్రం ‘సూరరై పోట్రు’. తెలుగులో ‘ఆకాశం నీ హద్దురా !’ పేరుతో విడుదలకానుంది. ఎయిర్ డెక్కన్ విమానయాన సంస్థ ఫౌండర్, పైలట్ జీఆర్ గోపినాధ్ జీవిత కథ ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కింది. ఈ సినిమా కోసం టీమ్ మొదటి నుండి చాలా కష్టాలే పడింది. రియలిస్టిక్ స్టోరీ కాబట్టి పర్ఫెక్షన్ కోసం చాలా ప్రయత్నాలే చేశారు. నిజమైన ఎయిర్ ఫోర్స్ లొకేషన్లలో, నిజమైన విమానాలతో చిత్రీకరణ జరిపారు. ఈ చిత్రీకరణ కోసం విమానయాన రంగం నుండి, దేశ భద్రతా విభాగం నుండి అనేక అనుమతులు తీసుకున్నారు.

ఇక నటీనటుల విషయంలో కూడ చాలా జాగ్రత్తలు పాటించారట. సినిమాలో మొత్తం 96 పాత్రలు ఉంటాయట. ఈ పాత్రల్లో నటించిన నటీ నటులు ప్రతిఒక్కరినీ స్క్రీన్ టెస్ట్ చేసిన తర్వాతే ఎంపిక చేశారట. ఒక్క డైలాగ్ ఉన్న పాత్రైనా సరే టెస్ట్ తర్వాతే ఎంపిక చేశారట. దీన్నిబట్టి సినిమా కోసం అనేక మంది ఆర్టిస్టులను పరిశీలించారని అర్థమవుతోంది. గత నెల 30వ తేదీనే విడుదలకావల్సిన ఈ సినిమాను పలు కారణాల వలన నవంబర్ 12న అమెజాన్ ద్వారా రిలీజ్ చేయనున్నారు. ఈ చిత్రాన్ని సుధా కొంగర డైరెక్ట్ చేయగా జీవీ ప్రకాష్ సంగీతం అందించారు.

తాజా వార్తలు