నేను అలాంటి సినిమాలు తీయను : శేఖర్ కమ్ముల

నేను అలాంటి సినిమాలు తీయను : శేఖర్ కమ్ముల

Published on Aug 12, 2012 6:30 PM IST


శేఖర్ కమ్ముల సున్నితమైన మరియు ఎంతో వేవేకవంతమైన సినిమాలు తీసే దర్శకుడుగా పేరు తెచ్చుకున్నారు. ఇటీవలే మీదగ్గర నుంచి మాస్ ఎంటర్ టైనర్ సినిమాలు ఎప్పుడు వస్తాయి అని ఓ ప్రముఖ న్యూస్ పేపర్ వారు అడిగిన ప్రశ్నకు శేఖర్ కమ్ముల సమాధానమిస్తూ ‘ నాకు సున్నితమైన మరియు హృదయానికి హత్తుకునే సినిమాలు తీయడం అంటేనే ఇష్టం. ప్రస్తుతం క్రైమ్ మరియు మన సాంప్రదాయానికి విలువ ఇవ్వని వారిని రోజూ మన సమాజంలో చూస్తూనే వున్నాం. మళ్ళీ నేను అలాంటివాటిని తెరపై చూపించాలని అనుకోవడం లేదు. ఇలాంటి సున్నితమైన కథలతో సినిమాలు తీసే దర్శకులు ప్రస్తుతం మన ఇండస్ట్రీకి చాలా అవసరం అని’ ఆయన అన్నారు.

శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందిన ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రం అంతా ఒక కాలనీలో జరుగుతుంది మరియు ఒక మధ్య తరగతి కుటుంబాల మధ్య ఉండే ప్రేమానురాగాలను ఈ చిత్రంలో చూపించారు.

తాజా వార్తలు