రాష్ట్రంలోని టీవీ చానెల్స్ ను ఆదరిస్తున్న ప్రేక్షలకు కృతజ్ఞతలు. ఇప్పుడు టాలీవుడ్ టీవీ పేరుతో ఒక కొత్త టీవీ చానల్ ను ప్రారంబించారు. ఈ చానల్ ప్రారంభ వేడుకాని నిన్న గచ్చిబౌలిలో గ్రాండ్ గా నిర్వహించారు. సినిమా ఇండస్ట్రీకి చెందిన చాలా మంది ప్రముఖులు ఈ వేడుకకు హాజరైయ్యారు. ఈ వేడుకలో శ్రీదేవి చాలా అందంగా ప్రత్యేక ఆకర్షణగా నిలించింది. అలాగే మరి కొంత మంది ప్రముఖులు ఉదాహరణకు కృష్ణంరాజు, శ్రీకాంత్, అల్లరి నరేష్, మంచు మనోజ్, నవదీప్, నిఖిల్, కూడా ఈ వేడుకకు హాజరైయ్యారు. అలాగే హీరోయిన్స్ కాజల్, తమన్నా, శ్రియ శరన్ లు కూడా ఈ వేడుకకు హాజయ్యారు. అగ్రి గోల్డ్ గ్రూప్ వారు ఈ సరికొత్తగా అలోచించి ఈ టీవీ చానల్ ని ప్రారంబించారు. ఈ చానల్ లో తెలుగు సినిమాలని, న్యూస్ ని ప్రసారం చేయాలనుకుంటున్నట్లు అలాగే మరొక ఇంగ్లీష్ చానల్ ‘ట్రావెల్ ట్రెండ్జ్’ పేరుతో ప్రపంచ టూరిజం గురించి తెలియజేయనున్నట్లు ఎండీ సీతారం ఆవాస్ తెలియజేశారు.