బాలీవుడ్ కి వెళ్తున్న టాలీవుడ్ విలన్

బాలీవుడ్ కి వెళ్తున్న టాలీవుడ్ విలన్

Published on Aug 23, 2012 4:23 PM IST


క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తెలుగు తెరకు పరిచయమై ‘విక్రమార్కుడు’ సినిమాలో చేసిన విలన్ పాత్రతో మంచి పేరు తెచ్చుకుని నటుడు అజయ్. ఆ చిత్రం తర్వాత వరుసగా తెలుగు మరియు తమిళ భాషల్లో వరుసగా సినిమాలు చేస్తూ బిజీ గా ఉన్న అజయ్ కి బాలీవుడ్లో నటించే గోల్డెన్ చాన్స్ వచ్చింది. బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ హీరోగా తెరకెక్కనున్న ‘చెన్నై ఎక్స్ ప్రెస్’ సినిమాలో విలన్ పాత్ర పోషించే అవకాశం అజయ్ కి దక్కింది. హిందీలో ‘గోల్ మాల్’ సినిమా మూడు పార్ట్స్, ‘సింగం’ మరియు ‘బోల్ బచ్చన్’ సినిమాలతో సూపర్ హిట్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న రోహిత్ శెట్టి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం షారుఖ్ ఖాన్ ఆదిత్య చోప్రా దర్శకత్వం వహిస్తున్న ఒక చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్ర చిత్రీకరణ పూర్తవగానే ‘చెన్నై ఎక్స్ ప్రెస్’ మూవీ సెట్స్ పైకి వెళ్లనుంది.

తాజా వార్తలు