టాలీవుడ్‌లో విషాదం.. ప్రముఖ నిర్మాత మృతి

తెలుగు సినీ పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. అల్లు అర్జున్ స్నేహితుడు, యంగ్ ప్రొడ్యూసర్ కేదార్ సెలగంశెట్టి దుబాయ్‌లో కన్నుమూశారు. విజయ్ దేవరకొండ సోదరుడు ఆనంద్ దేవరకొండ నటించిన ‘గం గం గణేశా’ చిత్రానికి ఆయన నిర్మాతగా వ్యవహరించారు.

టాలీవుడ్‌లో స్టార్ ప్రొడ్యూసర్ బన్నీ వాస్‌కు సన్నిహితుడిగా కేదార్ సెలగంశెట్టి ఉన్నారు. అయితే, ఆయన ప్రస్తుతం దుబాయ్‌లో ఉండగా, అక్కడ తుదిశ్వాస విడిచినట్లు తెలుస్తోంది. ఆయన మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

సుకుమార్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ నటించబోయే సినిమాను కూడా కేదార్ సెలగంశెట్టి ప్రొడ్యూస్ చేయాల్సి ఉంది. ఆయన మృతిపై పలువురు టాలీవుడ్ ప్రముఖులు విచారం వ్యక్తం చేస్తున్నారు.

Exit mobile version