రన్బీర్ కపూర్ తాజా చిత్రం “బర్ఫీ” తెలుగు పరిశ్రమలో పలువురిని ఆకట్టుకుంది. అనురాగ్ బసు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రన్బీర్ కపూర్,ప్రియాంక చోప్రా మరియు ఇలియానాలు ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రం సెప్టెంబర్ 14న ప్రపంచ వ్యాప్తంగా విడుదల అయ్యింది ఈ చిత్రం చాలా బాగుంది అని అన్ని వైపులా నుండి సమాచారం తెలుగు పరిశ్రమలో కూడా పలువురు ప్రముఖులు ఈ చిత్రాన్ని చూసి చాలా బాగుంది అని చెప్పారు వాటిలో కొన్ని మాటలు మీకోసం.
లక్ష్మి మంచు : బర్ఫీ చాలా బాగుంది చిత్ర బృందానికి జోహార్ ప్రేమతో చంపేశారు ఖచ్చితంగా చూడాల్సిన చిత్రం
తాప్సీ : బర్ఫీ చూస్తున్నాను రన్బీర్ అందంగా కనిపిస్తున్నారు, ఇలియానా చాలా బాగుంది, ప్రియాంక చోప్రా ప్రదర్శన నన్ను ఆశ్చర్యానికి గురి చేసింది. చాలా రోజుల తరువాత సినిమా చూసి ఏడ్చాను భారతీయ నటులు సాంకేతిక నిపుణులు హాలివుడ్ కన్నా తక్కువని ఎవరన్నారు ఈ చిత్రాన్ని చుడండి మీకు తెలుస్తుంది
రీతు బర్మేచ : అద్భుతమయిన ప్రదర్శనలతో అద్భుతమయిన చిత్రం అయ్యింది “బర్ఫీ”
వీరుపొట్ల : బర్ఫీ తప్పక చూడవలసిన చిత్రం ప్రియాంక ప్రదర్శనకు రన్బీర్ నటన తోడయ్యి చిత్రాన్ని అద్భుతంగా మలచాయి.
బ్రహ్మాజీ : బర్ఫీ చాలా బాగుంది
గతంలో ఇలానే “ఇషాక్ జాదే” చిత్రం గురించి పలువురు ప్రముఖులు మాట్లాడారు ఆ చిత్ర రీమేక్ గురించి పరినీతి చోప్రా గురించి కూడా తెలుసుకున్నారు. ఇప్పుడు ఈ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేస్తారో లేదో చూడాలి. ఈ చిత్రం దేశవ్యాప్తంగా మంచి టాక్ సంపాదించుకుంది.