సిసిఎల్ – 3 కోసం రెడీ అవుతున్న టాలీవుడ్ హీరోలు

CCL3
సెలబ్రిటీ క్రికెట్ లీగ్ ప్రారంభమై మూడవ సీజన్లోకి ఎంటర్ అయింది. ఈ సీజన్లో మొదటి మ్యాచ్ టాలీవుడ్ వారియర్స్ వర్సెస్ బెంగాల్ టైగర్స్ మధ్య జరుగుతోంది. ఈ నెల 10న ఈ మ్యాచ్ వెస్ట్ బెంగాల్లోని సిలిగురిలో జరగనుంది. సాయంత్రం 5 గంటల నుండి జీ తెలుగులో ఈ మ్యాచ్ ప్రసారం కానుంది. తెలుగు వారియర్స్ టీంకి విక్టరీ వెంకటేష్ కెప్టెన్ గా వ్యవహరిస్తుండగా రామ్ చరణ్ ఈ టీంలో ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్నాడు. తరుణ్, శ్రీకాంత్, నితిన్, నిఖిల్ అజయ్, ప్రిన్సు సెసిల్, ఆదర్శ్ బాలకృష్ణ తదితరులు ఈ టీంలో ఆడనున్నారు. టీం సభ్యులు ఇప్పటికే కలకత్తా నుండి సిలిగురికి చేరుకొని ప్రాక్టీసు చేసారు. రేపు జరగనున్న మ్యాచ్ కి టాలీవుడ్ వారియర్స్ టీంకి అల్ ది బెస్ట్ చెబుదాం.

Exit mobile version