షూటింగ్స్ రద్దుకాలం పొడిగిస్తూ చిత్ర పరిశ్రమ నిర్ణయం.

షూటింగ్స్ రద్దుకాలం పొడిగిస్తూ చిత్ర పరిశ్రమ నిర్ణయం.

Published on Mar 20, 2020 9:00 PM IST

కొద్దిరోజుల క్రితం తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖులు, సాంకేతిక నిపుణులు, మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ సభ్యులు మార్చి 21వరకు షూటింగ్స్ నిలిపివేస్తూ నిర్ణయం తీసుకున్నారు. కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టే కార్యక్రమంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. అలాగే చిత్ర యూనిట్ సభ్యులు మరియు నటుల ఆరోగ్యం ద్రుష్టి లో ఉంచుకొని ఈ ప్రతిపాదన చేయడం జరిగింది.

ఐతే కరోనా వైరస్ ప్రభావం అంత కంతకు పెరుగుపోతున్న నేపథ్యంలో ఈ షూటింగ్స్ నిలిపి వేత తేదీని పొడిగించారు. మార్చి 21నుండి మార్చి 31 వరకు పొడిగించారు. నేడు హైదరాబాద్ ఫిల్మ్ ఛాంబర్ లో సమావేశమైన మా సభ్యులతో పాటు పరిశ్రమకు చెందిన 24 విభాగాలకు చెందిన ప్రముఖులు పాల్గొని ఈ నిర్ణయం తీసుకున్నారు. దీనితో మరి కొన్ని రోజులు షూటింగ్స్ కి బ్రేక్ పడనుంది. ఇప్పటికే టాలీవుడ్ కి చెందిన చిన్న, భారీ సినిమాల షూటింగ్స్ ఆగిపోవడం జరిగింది. ఏది ఏమైనా కరోనా వైరస్ టాలీవుడ్ పై తీవ్ర ప్రభావం చూపిస్తుంది.

తాజా వార్తలు