విక్టరీ వెంకటేష్ – పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కలిసి బాలీవుడ్ హిట్ సినిమా ‘ఓహ్ మై గాడ్’ రీమేక్ లో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది. ఈ సినిమాని శరత్ మరార్ – డి సురేష్ కలిసి నిర్మిస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాకి సరిపోయే టైటిల్ కోసం ఈ సినిమా టీం ప్రయత్నాలు మొదలు పెట్టింది. ఇప్పటికే కొన్ని పేర్లను పరిశీలిస్తున్నట్టు తెలిసింది. కానీ ఇప్పటి వరకు దేనిని ఫైనల్ చేయలేదు. ఈ సినిమా టీం ఈ సినిమా సబ్జెక్టు సరిపోయే విధంగా పలకడానికి కొత్తగా ఉండేలాంటి టైటిల్ కోసం అన్వేషిస్తున్నట్టు తెలిసింది. ‘గో గో గోవిందా’ అనే టైటిల్ ని పరిశీలిస్తున్నట్టు సమాచారం. కానీ ఇది ఫైనల్ కాలేదు. ఈ సినిమాని అక్టోబర్ 2, 2014 న విడుదల చేయాలని బావిస్తున్నారు. ఇప్పటి వరకు ఈ సినిమా హీరోయిన్, డైరెక్టర్ కన్ఫమ్ అవ్వలేదు.