అట్లీ ప్రాజెక్ట్ కి టార్గెట్ ఫిక్స్ చేసుకున్న బన్నీ?

alluarjun-atlee

ప్రస్తుతం వరల్డ్ క్లాస్ లెవెల్ హంగులతో తెరకెక్కిస్తున్న ఇండియన్ సినిమాల్లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా కోలీవుడ్ స్టార్ దర్శకుడు అట్లీ కాంబినేషన్ లో చేస్తున్న సెన్సేషనల్ ప్రాజెక్ట్ కూడా ఒకటి. అనౌన్సమెంట్ తోనే క్రేజీ హైప్ ని అందుకున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. అయితే ఈ సినిమా కోసం బన్నీ టార్గెట్ ని ఫిక్స్ చేసుకున్నట్టు ఇప్పుడు తెలుస్తుంది. చాలా సైలెంట్ గా తన పార్ట్ ని బన్నీ పూర్తి చేసేస్తున్నాడట.

ఇలా తన పోర్షన్ వరకు వచ్చే ఏడాది ఏప్రిల్ లేదా మే నాటికి తన పార్ట్ మొత్తాన్ని కంప్లీట్ చేసే యోచనలో ఉన్నాడట. దీనితో బన్నీ మాత్రం పక్కా ప్లానింగ్ గా ఈ సినిమాని కంప్లీట్ చేస్తున్నాడని చెప్పాలి. ఇక ఈ చిత్రంలో దీపికా పదుకోణ్ హీరోయిన్ గా నటిస్తుండగా సాయి అభ్యంకర్ సంగీతం అందిస్తున్నాడు. అలాగే సన్ పిక్చర్స్ నిర్మాణం వహిస్తున్న ఈ సినిమా ఇండియన్ సినిమా దగ్గర భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న అతి కొద్ది సినిమాల్లో ఒకటిగా ఉంది.

Exit mobile version