టాలీవుడ్లో తెరకెక్కుతున్న ప్రెస్టీజియస్ చిత్రం SSMB29 కోసం ప్రేక్షకులు ఏ రేంజ్లో ఎదురుచూస్తున్నారో అందరికీ తెలిసిందే. ఈ సినిమాను దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి తెరకెక్కిస్తుండగా, సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటిస్తున్నాడు. ఇక ఈ సినిమా నుండి వరుస అప్డేట్స్ ఇస్తూ చిత్ర యూనిట్ సందడి చేస్తోంది. రీసెంట్గా ఈ చిత్రానికి సంబంధించిన లిరికల్ సాంగ్ ‘గ్లోబ్ ట్రాటర్’ను మేకర్స్ రిలీజ్ చేశారు.
అయితే, ఈ పాటను శ్రుతి హాసన్ తనదైన వాయిస్‌తో పాడటం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. కానీ, ఇప్పుడు ఈ పాటకు కాపీ రూమర్స్ వినిపిస్తున్నాయి. హాలీవుడ్‌కి చెందిన ఓ పాప్ ఆల్బమ్ సాంగ్‌కు ఈ పాట దగ్గర పోలికలు ఉందని పలువురు కామెంట్ చేస్తున్నారు.
దీంతో మరోసారి SSMB29 కాపీ రూమర్స్ బారిన పడింది. ఇప్పటికే ఈ చిత్ర పోస్టర్స్ కూడా కాపీ అంటూ సోషల్ మీడియాలో వార్తలు వినిపించాయి. మరి ఈ కాపీ వార్తలపై మేకర్స్ ఏదైనా రెస్పాండ్ అవుతారేమో చూడాలి.
