విజయ్ దేవరకొండ నెక్స్ట్ మూవీకి ముహూర్తం ఫిక్స్..!

రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘కింగ్డమ్’ ఈ నెల 31న గ్రాండ్ రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఈ సినిమాను దర్శకుడు గౌతమ్ తిన్ననూరి డైరెక్ట్ చేస్తుండగా ఈ సినిమాలో విజయ్ సరికొత్త లుక్‌తో కనిపిస్తున్నాడు. ఇక ఈ సినిమా తర్వాత విజయ్ తన నెక్స్ట్ చిత్రాన్ని రాహుల్ సాంకృత్యాయన్ డైరెక్షన్‌లో చేసేందుకు సిద్ధమవుతున్నాడు.

అయితే, ఈ సినిమాకు సంబంధించి మేకర్స్ తాజాగా ఓ సాలిడ్ అప్డేట్ అయితే ఇచ్చారు. విజయ్ దేవరకొండ కెరీర్‌లో 14వ చిత్రంగా రాబోతున్న ఈ సినిమా పూజా కార్యక్రమాలను జూలై 10న ఉదయం 11.09 గంటలకు నిర్వహించబోతున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. ఇక ఈ పూజా కార్యక్రమానికి ఎవరెవరు గెస్టులుగా వస్తారనేది ప్రస్తుతానికి సస్పెన్స్‌గా ఉంది.

ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్, టి-సిరీస్ బ్యానర్లు సంయుక్తంగా ప్రొడ్యూస్ చేస్తున్నాయి. మన చరిత్రకు సంబంధించిన అతిపెద్ద ఘటనను మనకు ఈ సినిమా ద్వారా తెలియజేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతున్నట్లు ప్రకటించింది.

Exit mobile version