హీరో శర్వానంద్ ప్రస్తుతం వరుస చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్నాడు. ఆయన నటిస్తున్న చిత్రాల్లో ‘బైకర్’ అనే స్పోర్ట్స్ డ్రామా కూడా ఒకటి. ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్స్ ఇటీవల రిలీజ్ అయ్యి ప్రేక్షకుల్లో మంచి బజ్ క్రియేట్ చేశాయి.
ఇక ఇప్పుడు ఈ సినిమా నుంచి ఓ సాలిడ్ అప్డేట్ అయితే మేకర్స్ ఇచ్చారు. ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ గ్లింప్స్‌ను రిలీజ్ చేసేందుకు మేకర్స్ టైమ్ ఫిక్స్ చేశారు. ‘బైకర్’ మూవీ ఫస్ట్ గ్లింప్స్‌ను నవంబర్ 1న సాయంత్రం 4.05 గంటలకు రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు.
ఈ సినిమాను అభిలాష్ రెడ్డి డైరెక్ట్ చేస్తుండగా మాళవిక నాయర్ హీరోయిన్‌గా నటిస్తోంది. గిబ్రాన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను యూవీ క్రియేషన్స్ ప్రొడ్యూస్ చేస్తున్నారు.
