దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్లో తెరకెక్కుతున్న ప్రెస్టీజియస్ చిత్రం SSMB29 కోసం ప్రేక్షకులు ఏ రేంజ్లో ఆతృతగా చూస్తున్నారో అందరికీ తెలిసిందే. ఈ సినిమాను గ్లోబ్ ట్రాటర్‌గా ప్రేక్షకులను మెస్మరైజ్ చేయనుందని చిత్ర యూనిట్ చెబుతోంది. ఇక నవంబర్ నెలలో ఈ సినిమా నుంచి ఓ సాలిడ్ అప్డేట్ రాబోతున్నట్లు చిత్ర యూనిట్ గతంలో ప్రకటించింది.
అయితే, తాజాగా నవంబర్ నెల ప్రారంభమైందంటూ మహేష్ బాబు ఈ చిత్ర అప్డేట్స్పై చిత్ర యూనిట్‌ను ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశాడు. దీంతో దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి ఈ మూవీ నుంచి సర్ప్రైజ్లు ఒక్కొక్కటిగా రివీల్ చేద్దామని రిప్లై ఇవ్వగా.. ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ లను ట్యాగ్ చేస్తూ మహేష్ ఓ ఆటాడుకున్నాడు. దీంతో వారు కూడా ఈ సినిమాపై తమదైన స్టయిల్లో ఒక్కొక్కటిగా విషయాలను రివీల్ చేస్తూ వస్తున్నారు.
దీంతో ఈ సినిమాలో ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ అఫీషియల్‌గా నటిస్తున్నట్లు తేలిపోయింది. ఇక ఈ సినిమాకు సంబంధించి ఏదైనా అప్డేట్ ఇవ్వమని మహేష్ కోరగా, హీరోకు సంబంధించిన అప్డేట్ అయితే ఉండబోదు అనేలా రాజమౌళి కౌంటర్ ఇస్తున్నాడు. దీంతో అసలు SSMB29 మేకర్స్ ఏం ప్లాన్ చేస్తున్నారా అని అభిమానులు థ్రిల్ అవుతున్నారు.
It’s November already @ssrajamouli ????
— Mahesh Babu (@urstrulyMahesh) November 1, 2025
