గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం తన లేటెస్ట్ చిత్రం ‘అఖండ 2’ని రిలీజ్‌కు రెడీ చేస్తున్నాడు. ఈ సినిమాను బోయపాటి శ్రీను డైరెక్ట్ చేస్తున్నారు. ఇక ఈ సినిమా తర్వాత బాలయ్య తన నెక్స్ట్ చిత్రాన్ని దర్శకుడు గోపీచంద్ మలినేని డైరెక్షన్లో తెరకెక్కించేందుకు సిద్ధమయ్యాడు.
NBK111 వర్కింగ్ టైటిల్‌తో ఈ సినిమా రూపొందనుంది. కాగా, ఈ సినిమాలో బాలయ్య సరసన హీరోయిన్గా ఎవరు నటిస్తారనే విషయంపై క్లారిటీ ఇచ్చేందుకు మేకర్స్ రెడీ అయ్యారు. రాణి వచ్చేస్తోంది.. అంటూ ఈ చిత్ర హీరోయిన్ను పరిచయం చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అయింది.
ఈ చిత్రంలో నటిస్తున్న హీరోయిన్ ఎవరనే విషయాన్ని నవంబర్ 18న ఉదయం 10.40 గంటలకు రివీల్ చేయబోతున్నట్లు చిత్ర యూనిట్ వెల్లడించింది. అయితే, ఈ సినిమాలో నయనతార ఫిక్స్ అయ్యిందనే టాక్ జోరుగా వినిపిస్తోంది. ఈ సినిమాను గోపీచంద్ మలినేని డైరెక్ట్ చేస్తుండటంతో అభిమానుల్లో అంచనాలు ఏర్పడ్డాయి.


