దుల్కర్ సల్మాన్, భాగ్యశ్రీ బొర్సె, సముద్రఖని ముఖ్య పాత్రల్లో నటించిన లేటెస్ట్ చిత్రం ‘కాంత’ బాక్సాఫీస్ దగ్గర సందడి చేస్తోంది. పీరియాడిక్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాలో దుల్కర్, భాగ్యశ్రీల పర్ఫార్మెన్స్కు ప్రేక్షకుల నుంచి మంచి మార్కులు పడుతున్నాయి.
ఇక ఈ సినిమా తొలి మూడు రోజుల్లో బాక్సాఫీస్ దగ్గర డీసెంట్ కలెక్షన్స్ రాబట్టింది. ఈ చిత్రానికి మూడు రోజుల్లో రూ.24.50 కోట్ల మేర గ్రాస్ వసూళ్లు దక్కినట్లు చిత్ర వర్గాలు వెల్లడించాయి. ఈ కథలోని డ్రామా ప్రేక్షకులను ఆకట్టుకుంటోందని చిత్ర యూనిట్ సంతోషం వ్యక్తం చేస్తోంది.
ఈ సినిమాలో రానా దగ్గుబాటి కాప్ రోల్ ప్రేక్షకులను ఇంప్రెస్ చేస్తోంది. సెల్వమణి సెల్వరాజ్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రాన్ని రానా దగ్గుబాటి, దుల్కర్ సల్మాన్, ప్రశాంత్ పొట్లూరి, జోమ్ వర్గీస్ ప్రొడ్యూస్ చేశారు.



