‘మిరాయ్’ ట్రైలర్‌కు టైమ్ ఫిక్స్.. ఎపిక్ వరల్డ్ పరిచయం అప్పుడే..!

టాలీవుడ్‌లో తెరకెక్కుతున్న యాక్షన్ థ్రిల్లర్ చిత్రాల్లో యంగ్ హీరో తేజ సజ్జా నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘మిరాయ్’పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఈ సినిమాను దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని డైరెక్ట్ చేస్తుండగా ఇందులో తేజ సజ్జా ఓ సూపర్ యోధ గా కనిపించనున్నాడు. ఇప్పటికే రిలీజ్ అయిన ఈ చిత్ర ప్రమోషనల్ కంటెంట్ ఈ మూవీపై మంచి బజ్ క్రియేట్ చేశాయి.

కాగా, ఈ సినిమా నుంచి థియేట్రికల్ ట్రైలర్‌ను రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అయ్యారు. ఈ చిత్ర ట్రైలర్‌తో ఎపిక్ వరల్డ్‌ను ప్రేక్షకులకు పరిచయం చేయబోతున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది. ఇక ఈ ట్రైలర్‌ను ఆగస్టు 28న మధ్యాహ్నం 12.06 గంటలకు రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ తాజాగా ప్రకటించింది.

ఇక ఈ సినిమాలో మంచు మనోజ్ విలన్ పాత్రలో నటిస్తుండటంతో ఈ సినిమాపై మరింత హైప్ క్రియేట్ అయింది. రితికా నాయక్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాకు గౌర హరి సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై టి.జి.విశ్వప్రసాద్, కృతి ప్రసాద్ ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా సెప్టెంబర్ 12న గ్రాండ్ రిలీజ్ చేసేందుకు మేకర్స్ సిద్ధమయ్యారు.

Exit mobile version