యంగ్ హీరో సందీప్ కిషన్ లేటెస్ట్ మూవీ ‘మజాకా’ రిలీజ్‌కు రెడీ అయ్యింది. దర్శకుడు నక్కిన త్రినాథరావు డైరెక్షన్లో తెరకెక్కిన ఈ సినిమా పూర్తి కామెడీ ఎంటర్టైనర్గా ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు సిద్ధమయ్యింది. ఇక ఈ సినిమా నుంచి ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్స్, టీజర్, సాంగ్స్, ప్రమోషనల్ కంటెంట్ మూవీపై సాలిడ్ బజ్‌ని క్రియేట్ చేశాయి.
తాజాగా ఈ చిత్ర ట్రైలర్‌ను రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది. ఈ చిత్ర ట్రైలర్‌ను ఫిబ్రవరి 23న ఉదయం 10.35 గంటలకు రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ వెల్లడించారు. ఈ ట్రైలర్ కట్ కూడా ఔట్ అండ్ ఔట్ ఎంటర్టైనర్గా ఉంటుందని చిత్ర యూనిట్ చెబుతోంది. ఈ సినిమాలో హీరోయిన్గా రీతూ వర్మ నటిస్తుంది. రావు రమేష్, అన్షు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.
లియోన్ జేమ్స్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను శివరాత్రి కానుకగా ఫిబ్రవరి 26న గ్రాండ్ రిలీజ్ చేయనున్నారు. మరి ‘మజాకా’ ట్రైలర్ ఎలా ఉంటుందో చూడాలి.