‘ఘాటి’ ట్రైలర్‌కు టైమ్ ఫిక్స్.. రిలీజ్ డేట్ ఇదేనా..?

‘ఘాటి’ ట్రైలర్‌కు టైమ్ ఫిక్స్.. రిలీజ్ డేట్ ఇదేనా..?

Published on Aug 5, 2025 8:09 PM IST

Ghaati

టాలీవుడ్ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాల్లో స్టార్ బ్యూటీ అనుష్క శెట్టి నటిస్తున్న ‘ఘాటి’ కూడా ఒకటి. ఈ సినిమాను దర్శకుడు క్రిష్ డైరెక్ట్ చేస్తుండగా పూర్తి క్రైమ్ అండ్ యాక్షన్ థ్రిల్లర్‌గా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్, టీజర్ ఈ సినిమాపై అంచనాలు పెంచాయి. ఇక ఈ సినిమా నుంచి ట్రైలర్, రిలీజ్ డేట్‌ను ప్రకటించేందుకు చిత్ర యూనిట్ రెడీ అయింది.

అయితే, ఈ ట్రైలర్‌ను ఆగస్టు ఆగస్టు 6న రిలీజ్ చేస్తున్నట్లు ఇప్పటికే వెల్లడించారు. తాజాగా ఈ ట్రైలర్ ఎప్పుడొస్తుందనే విషయాన్ని సరికొత్త పోస్టర్ ద్వారా అనౌన్స్ చేశారు. ఈ ట్రైలర్ ఆగస్టు 6న సాయంత్రం 4.45 గంటలకు రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ తెలిపారు. ఇక ఈ ట్రైలర్‌లోనే చిత్ర రిలీజ్ డేట్ కూడా ఉంటుందని వారు తెలిపారు.

కాగా, ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 5న రిలీజ్ చేస్తారనే టాక్ సినీ సర్కిల్స్‌లో గతకొద్ది రోజులుగా వినిపిస్తోంది. మరి ఈ సినిమా రిలీజ్ డేట్ ఇదేనా.. అనేది తెలియాలంటే ట్రైలర్ వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే.

తాజా వార్తలు