మాస్ మహారాజ్ “క్రాక్” ట్రైలర్ రచ్చకు టైం ఫిక్స్.!

మాస్ మహారాజ్ “క్రాక్” ట్రైలర్ రచ్చకు టైం ఫిక్స్.!

Published on Dec 31, 2020 3:00 PM IST

ప్రస్తుతం టాలీవుడ్ మాస్ మహారాజ రవితేజ హీరోగా శృతి హాసన్ హీరోయిన్ ఫా దర్శకుడు గోపీచంద్ మలినేని తెరకెక్కించిన మాస్ మసాలా ఎంటెర్టైనర్ “క్రాక్” విడుదలకు రెడీ అవుతుంది. ఈ సంక్రాంతి కానుకగా విడుదలకు ప్లాన్ చేస్తున్న ఈ చిత్రం నుంచి ట్రైలర్ ను ఈ కొత్త సంవత్సరం కానుకగా వదులుతున్నట్టు మేకర్స్ చెప్పిన సంగతి తెలిసిందే. అలాగే దానికి సంబంధించి ప్రమోషన్స్ కూడా మొదలు పెట్టారు.

అయితే ఈ ట్రైలర్ ను ఏ సమయానికి విడుదల చేస్తారో అన్నది ఇప్పుడు రివీల్ చేసారు. ఈ సాలిడ్ టీజర్ ను మేకర్స్ ఈ జనవరి 1న ఉదయం 11 గంటలకు విడుదల చెయ్యనున్నారు. దీనికి ముందు మంచి విజయం లేనప్పటికీ రవితేజ అభిమానుల్లో మరియు సినీ వర్గాల్లో మంచి హైప్ ఈ చిత్రానికి ఇప్పుడు ఉంది. మరి ఈ మాస్ మసాలా ట్రైలర్ ఎలా ఉండనుందో చూడాలి. థమన్ సంగీతం అందించిన ఈ చిత్రాన్ని ఠాగూర్ మధు నిర్మాణం వహించారు.

తాజా వార్తలు