నాగచైతన్య కోసం ఏకంగా మూడు..?

అక్కినేని హీరో నాగచైతన్య నటిస్తున్న లేటెస్ట్ చిత్రంపై అభిమానులతో పాటు సినీ సర్కిల్స్‌లో మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ఇక ఈ సినిమాను దర్శకుడు కార్తీక్ దండు తెరకెక్కిస్తుండగా పూర్తి మిస్టిక్ థ్రిల్లర్‌గా ఈ మూవీ రానుంది. ప్రస్తుతం NC24 అనే వర్కింగ్ టైటిల్‌తో ఈ చిత్ర షూటింగ్ జరుగుతోంది.

ఈ చిత్రానికి సంబంధించిన షూట్ కోసం ఓ భారీ సెట్ కూడా వేశారు. అయితే, ఈ సినిమా టైటిల్ విషయంలో చిత్ర యూనిట్ మూడు టైటిల్స్‌ను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ‘వృషకర్మ’ అనే టైటిల్‌పై మేకర్స్ ఆసక్తిగా ఉండగా, దర్శకుడి దగ్గర మరో రెండు టైటిల్స్ కూడా ఉన్నట్లు చిత్ర వర్గాలు చెబుతున్నాయి.

మరి అడ్వెంచర్ థ్రిల్లర్‌గా రాబోతున్న ఈ సినిమాకు ఎలాంటి టైటిల్ పెడతారు..? ఈ సినిమా కోసం అనుకుంటున్న మూడు టైటిల్స్‌లో మరో రెండు ఏమిటా..? అనే ప్రశ్న అభిమానుల్లో నెలకొంది. ఈ సినిమాలో మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా నటిస్తుండగా అజనీష్ లోక్‌నాథ్ సంగీతం అందిస్తున్నాడు.

Exit mobile version