‘హరిహర వీరమల్లు’ కి కావాలనే అడ్డంకులు!?

‘హరిహర వీరమల్లు’ కి కావాలనే అడ్డంకులు!?

Published on May 24, 2025 8:05 AM IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నిధి అగర్వాల్ హీరోయిన్ గా దర్శకుడు జ్యోతి కృష్ణ అలాగే క్రిష్ జాగర్లమూడి కలయికలో తెరకెక్కించిన అవైటెడ్ చిత్రమే హరిహర వీరమల్లు. అయితే ఎన్నో అంచనాలు ఉన్న ఈ చిత్రం ఎట్టకేలకు వస్తుంది అనుకుంటే లాస్ట్ మినిట్ లో థియేటర్స్ మూసివేత ఊహించని ట్విస్ట్ గా నిలిచింది.

అయితే ముందు ఇదేది ఉండదు అనే టాక్ కూడా వచ్చింది కానీ మొన్న ఫిలిం ఛాంబర్ లో జరిగిన మీట్ అంత సానుకూలంగా జరగకపోవడం అనేది మరో ట్విస్ట్ గా నిలిచింది. అయితే ఈ డ్రామా వెనుక ఒక నలుగురు నిర్మాతలు ఉన్నారంటూ ప్రచారం జరుగుతోంది. ఇదంతా పవన్ కళ్యాణ్ సినిమాను కావాలనే అడ్డుకునే యత్నం అంటూ మరో షాకింగ్ మాట వచ్చింది.

అయితే దీనిపై ఏపీ ప్రభుత్వం స్పందించి దీని వెనుక ఉన్న అసలు కారణం ఏంటో కనుక్కోవాలి అని సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ ఆదేశాలు జారీ చేశారు. దీనితో ఇప్పుడు పరిస్థితులు మరింత రసవత్తరంగా మారాయి. దీంతో అంతిమంగా ఏం జరుగుతోంది అనేది సస్పెన్స్ గా మారింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు