తుఫాన్ ఫస్ట్ లుక్ కి సూపర్బ్ రెస్పాన్స్

Thoofan
మెగా పవర్ స్టార్ రామ్ రామ్ చరణ్ నటించిన ‘తుఫాన్’ మూవీ ఫస్ట్ లుక్ ని నిన్న చిరంజీవి చేతుల మీదుగా హైదరాబాద్లో లాంచ్ చేసారు. ఈ మూవీ ఫస్ట్ లుక్ కి ఫ్యాన్స్, సినీ ప్రేమికుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది, ఈ రెస్పాన్స్ ఈ చిత్ర చిత్ర ప్రొడక్షన్ టీంలో ఫుల్ జోష్ ని నింపింది . ఫుల్ ఎంటర్ ఎంటర్టైనింగ్ గా ఉండే పవర్ఫుల్ పొలీస్ డ్రామాగా ఈ సినిమా ఉండనుందని ఈ మూవీ ఫస్ట్ లుక్ చూస్తే మనకు తెలుస్తుంది.

ఎసిపి పాత్రాలో చరణ్ కనిపించనున్నాడు, అలాగే ప్రియాంక చోప్రా హీరోయిన్ గా కనిపించనుంది. ప్రకాష్ రాజ్, శ్రీహరి తెలుగు వెర్షన్ లో కీలక పాత్రలు పొషిస్తున్నారు. ‘జంజీర్ ‘ గా హిందీలో రీమెక్ అవుతున్న ఈ సినిమాని తెలుగులో ‘తుఫాన్ గా రిలీజ్ చేస్తున్నారు. అపూర్వ లిఖియా డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా సమ్మర్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. తెలుగులో శ్రీహరి చేస్తున్న షేర్ ఖాన్ పాత్రని హిందీలో సంజయ్ దత్ చేస్తున్నారు

ట్రైలర్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Exit mobile version