ఈ యంగ్ హీరోయిన్ చరణ్ కు పెద్ద ఫ్యాన్ అట.!

ఈ యంగ్ హీరోయిన్ చరణ్ కు పెద్ద ఫ్యాన్ అట.!

Published on Nov 16, 2020 12:00 AM IST

స్టార్ సినీ నటులకు కేవలం సామాన్య ప్రేక్షకుల్లోనే కాకుండా ఇతర నటీనటుల్లో కూడా అభిమానించే వారు ఉంటారు. ముఖ్యంగా అయితే ఇప్పుడిప్పుడే సినిమాలు చేసే నటుల్లో వారు ఎక్కువగా కనిపిస్తారు. అలా ఎవరొక సీనియర్ హీరో లేదా హీరోయిన్ ను ప్రేరణగా తీసుకున్న వారితో పాటుగా ఫ్యానిజం చూపే వాళ్ళు కూడా అనేకం ఉన్నారు. అలా లేటెస్ట్ యంగ్ అండ్ సెన్సేషనల్ హీరోయిన్ కృతి శెట్టి తాను మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కు ఒక పెద్ద అభిమానిని అని చెప్పుకొచ్చింది.

అలాగే తాను సినిమాల్లోకి రాక ముందు చరణ్ అన్ని సినిమాలు చూసేసిందట. మెగా ఫ్యాన్ అయినటువంటి ఈ యంగ్ హీరోయిన్ అదే మెగా ఫ్యామిలీకు చెందిన యువ హీరో వైష్ణవ్ తేజ్ తో “ఉప్పెన” అనే సినిమాతోనే టాలీవుడ్ లోకి అడుగు పెట్టడం విశేషం. అలాగే ఇంకా విడుదల కూడా కానీ ఈ చిత్రం నుంచే ఈమె మంచి క్రేజ్ ను అలాగే ఆఫర్స్ ను దక్కించుకోవడం గమనార్హం. ఈ చిత్రానికి బుచ్చిబాబు సన దర్శకత్వం వహించగా దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.

తాజా వార్తలు