చిరుకి బాగా దగ్గరవుతున్న యంగ్ హీరో

చిరుకి బాగా దగ్గరవుతున్న యంగ్ హీరో

Published on Jul 17, 2020 12:10 AM IST

యంగ్ హీరో కార్తికేయ మెగా స్టార్ చిరంజీవి డై హార్డ్ ఫాన్స్ లో ఒకరు. ఇటీవల జరిగిన ఓ అవార్డు వేడుకలో కార్తికేయ స్పీచ్ చిరు చేత కంటతడి పెట్టించింది. చిరంజీవి సాంగ్స్ కి స్టెప్స్ వేసిన కార్తికేయ, తన స్పీచ్ లో మెగాస్టార్ పరిశ్రమలోని అందరూ యంగ్ హీరోలకు తండ్రితో సమానం అన్నారు. ఆ సంధర్భం చిరుకి కార్తికేయను బాగా దగ్గర చేసినట్లుంది. ఇక నేడు కరోనా వైరస్ పై చేసిన ఓ సోషల్ అవేర్నెస్ వీడియోలో చిరంజీవి, కార్తికేయతో కలిసి కనిపించారు. అలాగే ఆ వీడియోకి సహకరించి నందుకు ధన్యవాదాలు తెలిపారు చిరు. ఓ వర్ధమాన హీరోకి చిరు లాంటి వారి అండ ఉండడం కెరీర్ కి బూస్ట్ ఇచ్చే అంశమే.

కార్తికేయ ప్రస్తుతం చావు కబురు చల్లగా అనే కామెడీ రొమాంటిక్ ఎంటర్టైనర్ లో నటిస్తున్నారు. బస్తీ బాలరాజు అనే పాత్ర ఆయన చేస్తున్నారు. లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా నటిస్తుంది. అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కౌశిక్ పెగళ్ళపాటి దర్శకత్వం వహిస్తున్నారు.

తాజా వార్తలు