యంగ్ రెబల్ స్టార్ హీరోగా “మిర్చి” అనే సినిమాతో టాలీవుడ్ లోకి ఎంటర్ అయ్యి ఇప్పుడు పాన్ ఇండియన్ లెవెల్ సినిమాలను తీసే స్థాయికి ఎదిగిన నిర్మాణ సంస్థ “యూవీ క్రియేషన్స్”. ప్రభాస్ తో ఇప్పటికే “సాహో” లాంటి భారీ యాక్షన్ థ్రిల్లర్ ను తీసి ఇప్పుడు మరో పీరియాడిక్ పాన్ ఇండియన్ ఫిల్మ్ “రాధే శ్యామ్” తీస్తున్నారు.
అలాగే ఒకపక్క ఇలాంటి భారీ సినిమాలు మరోపక్క టాలెంట్ ఉన్న ఫిల్మ్ మేకర్స్ తో చిన్నపాటి ఇంట్రెస్టింగ్ సినిమాలను కూడా వీరు చేసారు.అంతే కాకుండా ఇప్పుడు మరిన్ని మీడియం బడ్జెట్ సినిమాలను కూడా చేయనుండగా అలాంటి ఓ సినిమాకే ఓ టాలెంటెడ్ హీరోయిన్ గోల్డెన్ ఛాన్స్ ను దక్కించుకుందట.
“సప్తగిరి ఎల్ ఎల్ బి”, అలాగే “ఫస్ట్ ర్యాంక్ రాజు” చిత్రాల్లో నటించి మెప్పించిన యువ హీరోయిన్ బ్యూటీ కాషిష్ వోహ్రా ను హీరోయిన్ గా తీసుకోబోతున్నట్లుగా తెలిసింది. మరి అలాగే ఈ ప్రాజెక్ట్ కు సంబంధించి మరిన్ని విషయాలు తొందరలోనే బయటకు రానున్నాయి.