ప్రస్తుతం యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ లైనప్ లో మూడు భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ లు ఉన్నాయి. వీటిలో మాత్రం ఎప్పటికప్పుడు రెగ్యులర్ గా అప్డేట్లు ఇస్తుంది మాత్రం “ఆదిపురుష్” టీం అని చెప్పాలి. మిథలాజికల్ డ్రామాగా ఈ చిత్రాన్ని ఓం రౌత్ చాలా ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కించనున్నారు.
ఇప్పటికే టైం టు టైం అప్డేట్లు ఇస్తున్న చిత్ర యూనిట్ ఈ సినిమాను వచ్చే ఏడాది మొదలు పెట్టి ఆ తర్వాత ఏడాదికే విడుదల చెయ్యాలని ప్లానింగ్ లో ఉంది. అయితే ఇప్పుడు తాజాగా వినిపిస్తున్న టాక్ ప్రకారం ఈ సినిమా మెయిన్ వర్కే ఇంకా పూర్తి కాలేదన్నట్టు తెలుస్తుంది.
ఈ రామాయణ గాథపై తెరకెక్కించనున్న ఈ సినిమాకు సంబంధించి ఇంకా స్క్రిప్ట్ వర్క్ పూర్తి కాలేదట. అది తొందరలోనే పూర్తి అయ్యిపోతుంది అని ఆ అనంతరం ఈ చిత్రం పట్టాలెక్కనుంది. ఈ చిత్రాన్ని ఓంరౌత్ మొత్తం 5 భాషల్లో 3డి టెక్నాలజీలో విడుదల చేయనున్నారు.