టాలీవుడ్ యూత్ స్టార్ నితిన్ హీరోగా నటించిన లేటెస్ట్ చిత్రం “భీష్మ”. రష్మికా మందన్నా హీరోయిన్ గా నటించిన ఈ చిత్రాన్ని వెంకీ కుడుములు దర్శకత్వం వహించారు. అయితే ఈ ఏడాది విడుదల కాబడిన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర అద్భుత విజయాన్ని అందుకొని నితిన్ కు సాలిడ్ కం బ్యాక్ హిట్ గా నిలవడమే కాకుండా ఈ ఏడాది లో నిలిచిన ఆఖరి హిట్ చిత్రంగా కూడా నిలిచింది.
అయితే క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా బిగ్ స్క్రీన్ పై అలరించిన ఈ చిత్రం తాలూకా టెలివిజన్ ప్రీమియర్ కు మాత్రం ఊహించని టీఆర్పీనే వచ్చింది. గత కొన్ని రోజుల కితం జెమినీ టీవిలో ప్రసారం కాబడిన ఈ చిత్రానికి కేవలం 6.65 టీఆర్పీ మాత్రమే రావడం గమనార్హం. అటు డీసెంట్ అనీ కాకుండా అలాగే మరీ తక్కువ కూడా కాకుండా మధ్యలో రేటింగ్ రావడంతో నెటిజన్స్ కూడా అంతగా రియాక్ట్ కాలేకపోతున్నారు. మొత్తానికి మాత్రం ఇలాంటి సినిమాకు ఇంత రేటింగ్ కాస్త డిజప్పాయింటింగ్ అంశమే అని చెప్పాలి.