ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న చిత్రం “వకీల్ సాబ్”. శ్రీరామ్ వేణు దర్సకత్వంలో తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో పవన్ రెండు వేరియేషన్స్ లో కనిపించనున్న సంగతి తెలిసిందే. అయితే ఎప్పుడో ప్లాన్ చేసిన ఈ చిత్రం కాస్తా ఆలస్యం అయ్యింది. దీనితో ఈ భారీ గ్యాప్ లో సినిమాకు సంబంధం లేకుండా పవన్ లుక్ మారడంతో సినిమాలో ఎలా కనిపిస్తారా అని అంతటా అనుమానం వ్యక్తం అయ్యింది.
కానీ ఊహించని విధంగా పవన్ సర్ప్రైజ్ చేసారని చెప్పాలి. అలాగే పవన్ చూపిన ఈ చేంజ్ అతను చేసే నెక్స్ట్ సినిమాలపై కూడా లుక్స్ పరంగా ఎలాంటి ఎఫెక్ట్ ను చూపించదని కూడా చెప్పొచ్చు. ఇక నుంచి కూడా పవన్ ఇదే లుక్ ను మైంటైన్ చేస్తే హరీష్ శంకర్ తో చేసే సినిమాకు కూడా మినిమం అంచనాలు పెట్టుకోవచ్చు. మొత్తానికి మాత్రం పవర్ స్టార్ నయా లుక్ ఓ రేంజ్ లో వైరల్ అవుతుంది.