సూర్యకు కథ చెప్పిన మరో తెలుగు డైరెక్టర్..?

సూర్యకు కథ చెప్పిన మరో తెలుగు డైరెక్టర్..?

Published on Nov 19, 2025 10:01 PM IST

suriya

తమిళ హీరో సూర్య ప్రస్తుతం దర్శకుడు వెంకీ అట్లూరి డైరెక్షన్‌లో రూపొందుతున్న తన 46వ చిత్ర షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. ఇక ఆయన నటిస్తున్న ‘కరప్పు’ త్వరలో రిలీజ్‌కు రానుంది. అయితే, ఈ సినిమాలతో బిజీగా ఉన్న సూర్య ఇప్పుడు మరో తెలుగు డైరెక్టర్ కథను విన్నట్లుగా తెలుస్తోంది.

రీసెంట్‌గా టాలీవుడ్ దర్శకుడు పరశురామ్ సూర్యకు ఓ కథను చెప్పాడనే వార్తలు వినిపించాయి. ఇప్పుడు మరో తెలుగు డైరెక్టర్ వివేక్ ఆత్రేయ కూడా సూర్యకు ఓ కథను వినిపించారని తెలుస్తోంది.

ఈ వార్తలతో అభిమానుల్లో ఆసక్తి పెరిగిపోయింది. త్వరలో అధికారిక ప్రకటన వస్తుందని వారు ఆశిస్తున్నారు. వివేక్ ఆత్రేయ లాస్ట్ మూవీ ‘సరిపోదా శనివారం’ బాక్సాఫీస్ దగ్గర సాలిడ్ హిట్‌గా నిలిచింది. మరి సూర్య కోసం ఆయన ఎలాంటి కథను రెడీ చేశాడో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు