చైతు సినిమాలో మరో టాలెంటెడ్ హీరోయిన్.?

చైతు సినిమాలో మరో టాలెంటెడ్ హీరోయిన్.?

Published on Nov 6, 2020 7:19 PM IST

అక్కినేని కుటుంబం నుంచి వచ్చిన యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో నాగ చైతన్య “మజిలీ” తో మంచి హిట్ అందుకొని ఇప్పుడు శేఖర్ కమ్ముల దర్శకత్వంలో “లవ్ స్టోరీ” అనే చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. అలాగే ఈ చిత్రం లైన్ లో ఉండగానే విలక్షణ దర్శకుడు విక్రమ్ కె కుమార్ తో కూడా ఒక ఆసక్తికర సినిమాను కూడా అనౌన్స్ చేసేసారు.

అయితే ఇది వరకే ఈ దర్శకుడు అక్కినేని కుటుంబానికి మరియు అక్కినేని అభిమానులకు మరపురాని చిత్రం “మనం”ను ఇవ్వడం అలాగే యంగ్ హీరో అఖిల్ తో “హలో” అనే మరో ఇంప్రెసింగ్ సినిమా ఇవ్వడంతో చైతు సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయి.

ఈ చిత్రానికి “థ్యాంక్యు” అనే టైటిల్ ను కూడా పెట్టేసారు. అయితే ఈ చిత్రంలో టాలెంటెడ్ హీరోయిన్ ప్రియాంకా అరుళ్ మోహన్ ను కూడా మేకర్స్ ఎంచుకున్నట్టు తెలుస్తుంది. ఈ హీరోయిన్ ఇప్పటికే విక్రమ్ కె కుమార్ తీసిన గత చిత్రం నాని “గ్యాంగ్ లీడర్” లో నటించి మెప్పించింది. మరి ఈ చిత్రంలో కూడా ఉందో లేదో చూడాలి.

తాజా వార్తలు