ఈ స్టైలిష్ – పవర్ కాంబోకు స్టార్ హీరోయిన్ పేరు?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా ప్రస్తుతం దర్శకుడు శ్రీరామ్ వేణు దర్శకత్వంలో “వకీల్ సాబ్” అనే చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇక అలాగే ఈ చిత్రంతో పాటుగా పవన్ లైనప్ లో మరో మూడు చిత్రాలు కూడా ఉన్నాయి. అయితే వాటిని అధికారికంగా మొన్న సెప్టెంబర్ 2న పవన్ పుట్టినరోజు సందర్భంగా ప్రకటించారు. అలా ప్రకటించిన వాటిలో మన టాలీవుడ్ స్టైలిష్ ఫిల్మ్ మేకర్ సురేందర్ రెడ్డితో ఓ ప్రాజెక్ట్ ను కూడా ప్రకటించేసారు.

అయితే ఈ చిత్రం మొదటి మూడు సినిమాల అనంతరం మొదలు కానుంది. ఇపుడు ఇదిలా ఉండగా ఈ స్టైలిష్ – పవర్ కాంబోకు దర్శకుడు సురేందర్ రెడ్డి ఓ స్టార్ హీరోయిన్ పేరును అండర్ లైన్ లో పెట్టినట్టు బజ్ వినిపిస్తుంది. ఆమె మరెవరో కూడా కాదు, బ్యూటీ హీరోయిన్ కాజల్ అగర్వాల్. ఇప్పటికే కాజల్ పవన్ తో “సర్దార్ గబ్బర్ సింగ్” చిత్రంలో నటించిన సంగతి తెలిసిందే. మరి రెండోసారి కూడా ఈ కాంబో మళ్ళీ సెట్ అయ్యిందో తెలియాలి అంటే ఇంకొన్నాళ్ళు ఆగాల్సిందే.

Exit mobile version