ఇప్పటికే మన టాలీవుడ్ లో ఎందరో స్టార్ నటులు కమెడియన్స్ ఇలా చాలా మందే ముందు ఒక రోల్ చేసి తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టిన వారున్నారు. అయితే ఇప్పుడు అలాగే ఒక స్టార్కమెడియన్ లో విలన్ గా కనిపించే లక్షణాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి.
అయితే అతడు మన టాలీవుడ్ కు చెందిన నటుడు కాదు కోలీవుడ్ లో స్టార్ కమెడియన్ వివేక్. అతని డబ్బింగ్ చిత్రాల ద్వారా మన తెలుగు ఆడియెన్స్ లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అపరిచితుడు, శివాజీ, బాయ్స్, రఘువరన్ బి టెక్ ఇలా ఎన్నెన్నో సినిమాల్లో ఐకానిక్ రోల్స్ చేసి నవ్వించిన ఈ స్టార్ కమెడియన్ ఎందుకో సడెన్ గా మేకోవర్ చేంజ్ చేసారు.
లేటెస్ట్ గా సాల్ట్ అండ్ పెప్పర్ లుక్ ను ప్రిపేర్ చేసి కొత్త ఫోటో షూట్స్ తో ఊహించని లుక్ పరిచయం చేసారు. ఇవి చూస్తే కనుక ఖచ్చితంగా విలన్ రోల్స్ కు కూడా అతడు సరిపోతారని చెప్పొచ్చు. మరి ఈ టాలెంటెడ్ నటుడు ప్రిపేర్ చేసిన ఈ షాకింగ్ లుక్ లో ఏదన్నా సినిమాలో కనిపిస్తారో లేదో చూడాలి.