బాలీవుడ్ కు వెళ్లనున్న మరో ఇంటెలిజెంట్ సినిమా.!

బాలీవుడ్ కు వెళ్లనున్న మరో ఇంటెలిజెంట్ సినిమా.!

Published on Jul 24, 2020 1:08 AM IST


ఈ మధ్య కాలంలోనే మన తెలుగు ఇండస్ట్రీకి చెందిన చాలా సినిమాలు రీమేక్ అయ్యేందుకు వెళ్లాయి. మన దగ్గర మంచి కంటెంట్ ఉన్న సినిమాలు అందుకున్న విజయాలను చూసి వాటి రీమేక్ హక్కులను వారు ఏమాత్రం ఆలస్యం చెయ్యకుండా కొనేస్తున్నారు.

అలా రీసెంట్ గా వచ్చిన “హిట్” మరియు “మత్తు వదలరా” సినిమాలు బాలీవుడ్ లో రీమేక్ కావడం కన్ఫర్మ్ అయ్యిపోయింది. ఇప్పుడు ఇదే బాటలో మరో ఇంటెలిజెన్స్ చిత్రం బాలీవుడ్ లో రీమేక్ అయ్యేందుకు ముహూర్తం కుదుర్చుకున్నట్టు తెలుస్తుంది. నవీన్ పొలిశెట్టి హీరోగా శ్రుతి శర్మ హీరోయిన్ గా స్వరూప్ దర్శకత్వంలో తెరకెక్కిన స్పై సస్పెన్స్ థ్రిల్లర్ “ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ”.

మన దగ్గర ఈ తరహా సినిమాలు చాలా అరుదుగానే వస్తుంటాయి. అయినప్పటికీ ఒక పర్ఫెక్ట్ స్పై థ్రిల్లర్ ఎలా ఉండాలో ఆ స్టాండర్డ్స్ ఎక్కడా తగ్గకుండా అందుకుంది. అయితే ఎప్పుడో ఈ సినిమా బాలీవుడ్ లోకి వెళ్తుందని ఎప్పుడో వార్త వచ్చినా ఇప్పుడు కన్ఫర్మ్ అయ్యినట్టు తెలుస్తుంది. మరి ఈ ఇంటెలిజెంట్ ప్రాజెక్ట్ లో అక్కడ ఎవరు నటించనున్నారో చూడాలి.

తాజా వార్తలు