ఈ స్పెషల్ ఎపిసోడ్ కు “బిగ్ బాస్” స్టేజ్ పై మరో స్టార్?

మన తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో అయినటువంటి బిగ్ బాస్ ఇప్పుడు నాలుగో సీజన్ సగానికి పైగా దాటేసింది. దీనితో ఎపిసోడ్స్ అండ్ ఎలిమినేషన్స్ అలాగే ఎంటర్టైన్మెంట్ కూడా టైట్ గా మారాయి. దీనితో ఏం జరుగుతుందా అని మరింత ఆసక్తి నెలకొంది. అయితే ఈ షోకు కింగ్ నాగార్జున అదిరిపోయే హోస్టింగ్ చేస్తున్నారు.

కానీ ఇటీవలే తన సినిమా షూటింగ్ నిమిత్తం బయటకు వెళ్లగా అప్పుడు దసరా వీకెండ్ స్పెషల్ ఎపిసోడ్ ను కింగ్ నాగార్జున కోడలు మరియు టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంతా అక్కినేని టేకప్ చేసి రక్తి కట్టించింది. దీనితో ఆ ఎపిసోడ్ కు కూడా మంచి టీఆర్పీ వచ్చింది.

అయితే ఈసారి దీపావళి పండుగకు బిగ్ బాస్స్టేజ్ మీదకు మరో స్పెషల్ గెస్ట్ రానున్నట్టుగా తెలుస్తుంది. అది కూడా మరెవరో కాదు అక్కినేని నాగార్జున తనయుడు మరియు టాలీవుడ్ స్టార్ హీరో అక్కినేని నాగ చైతన్య. ఈసారి దీపావళి వీకెండ్ ఎపిసోడ్ కు గాను చైతు ఎంట్రీ ఇవ్వనున్నాడని తెలుస్తుంది. సో ఈ ఎపిసోడ్ ఖచ్చితంగా మరింత స్పెషల్ అవుతుంది అని చెప్పాలి. మరి ఏం జరగనుందో చూడాలి.

Exit mobile version