ప్రస్తుతం ఓ నోటెడ్ సినిమాకి సంగీతం చాలా కీలకంగా మారుతుంది. ముఖ్యంగా సంగీత దర్శకుడు అనిరుద్ ఏదన్నా భారీ ప్రాజెక్ట్ కి వర్క్ చేస్తే దాని హైప్ ఇంకో లెవెల్ కి చేరుకుంటుంది. ఇలా లేటెస్ట్ గా కూలీ ఫస్ట్ సింగిల్ పట్ల మంచి హైప్ నెలకొనగా దీనిపై వచ్చిన ప్రోమోలు కూడా మంచి హిట్ అయ్యి ఆడియెన్స్ ని వైబ్ చేస్తున్నాయి.
అయితే ఇదే సినిమాతో పోటీకి వస్తున్న సెన్సేషనల్ మల్టీస్టారర్ చిత్రం “వార్ 2” నుంచి వచ్చే ఓ స్పెషల్ సాంగ్ మాత్రం కూలీ వైబ్ ని తలదన్నేలా ఉంటుంది అని వినిపిస్తుంది. ఈ సినిమాలో ఎన్టీఆర్, హృతిక్ లపై రిలీజ్ చేసే ఆ సాంగ్ మాత్రం కూలీ ఫస్ట్ సింగిల్ ని మించిన వైబ్ తో ఉంటుందని లేటెస్ట్ బజ్.
ఇది కానీ క్లిక్ అయితే పాన్ ఇండియా లెవెల్లో కూలీని మించి రెస్పాన్స్ అందుకున్నా ఎలాంటి ఆశ్చర్యం లేదని చెప్పొచ్చు. మరి ఈ మొదటి సాంగ్ ఎప్పుడు ఏంటి అనేది మేకర్స్ ఇంకా డిసైడ్ చేయలేదట. ఎలాగో సమయం దగ్గరకి వస్తుంది కాబట్టి త్వరలోనే ఈ సాంగ్ విడుదల ఉండొచ్చు.