“వకీల్ సాబ్”లో పవన్ చెప్పే ఈ డైలాగ్ కు గూస్ బంప్స్.!

“వకీల్ సాబ్”లో పవన్ చెప్పే ఈ డైలాగ్ కు గూస్ బంప్స్.!

Published on Nov 8, 2020 9:57 PM IST


ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ చిత్రం “వకీల్ సాబ్”. చాలా కాలం తర్వాత పవన్ నుంచి రాబోతున్న సినిమా కావడంతో దీనిపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఈ సుదీర్ఘ విరామం ను పూడ్చడానికి మేకర్స్ టీజర్ ను విడుదల చెయ్యాలని పవన్ అభిమానులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు.

అయితే అది ఈ దీపావళికి అంచనా వేస్తున్నారు కానీ సినిమాకు సంబంధించి మాత్రం ఓ లేటెస్ట్ టాక్ ఇప్పుడు వినిపిస్తుంది. దర్శకుడు శ్రీరామ్ వేణు ఇప్పటికే ఒరిజినల్ వెర్షన్ “పింక్”కు దీనికి చాలానే మార్పులు చూపులు యాడ్ చేసారు. అలా ఈ చిత్రంలో ఒక పవర్ ఫుల్ సీన్ కు గాను పవన్ చేత పవర్ ఫుల్ డైలాగ్ చెప్పించారట. అది కోర్టులో ఉండే ఒక సీన్ అన్నట్టు తెలుస్తుంది.

అలాగే పవన్ చెప్పే ఈ డైలాగ్ థియేటర్స్ లో గూస్ బంప్స్ తెప్పించే విధంగా ఉంటుందని సమాచారం. ఇప్పటి వరకు పవన్ నుంచి సింగిల్ టేక్ లో చాలానే పవర్ ఫుల్ డైలాగ్స్ విన్నాము. ఇది కూడా ఆ రేంజ్ లో ఉంటుందని అంటున్నారు. మరి ఈ వకీల్ సాబ్ చెప్పే ఆ పవర్ ఫుల్ డైలాగ్ ఎలా ఉంటుందో తెలియాలి అంటే వచ్చే ఏడాది సంక్రాంతి వరకు ఆగక తప్పదు.

తాజా వార్తలు