పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రెండు మూడు మూవీ ప్రాజెక్టులను లైన్ లో పెట్టుకున్న సంగతి అందరికి తెలిసిందే. వకీల్ సాబ్ మరియు క్రిష్ లతో తీస్తున్న సినిమా మాత్రమే కాకుండా హరీష్ తో కూడా ఓ సినిమా ఒకే చేసేసారు. మళ్ళీ ఈ లోపులోనే పవన్ మరో సినిమా చేసేందుకు ఆసక్తి చూపుతున్నారని ఓ వార్త బయటకొచ్చింది. గత ఏడాది మళయాళంలో వచ్చిన “డ్రైవింగ్ లైసెన్స్” సినిమాను రీమేక్ చేసేందుకు పవన్ ఆసక్తి కనబర్చారని టాక్ వినిపించింది.
అక్కడ పృథ్వీ రాజ్ మరోయు సూరజ్ వెంజరమూడు ల ప్రధాన తారాగణంతో వచ్చిన ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకొని సూపర్ హిట్ గా నిలిచింది. అయితే ఈ సినిమా రీమేక్ తెలుగులో పవన్ తో పట్టాలెక్కితే మరో మెగా హీరో పవన్ తో కలసి స్క్రీన్ ను పంచుకున్నాడని బజ్ వినిపిస్తుంది. అది కూడా మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ పేరు ఎక్కువగా వినిపిస్తుంది. అయితే ఇంకా ఏ విషయమూ ఖరారు కాని ఈ చిత్రంపై ఇంతటి బజ్ సంతరించుకోవడం విశేషం.