‘వీరమల్లు పార్ట్ 2’ టైటిల్ ఇదే!

Hari Hara Veera Mallu

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన లేటెస్ట్ అవైటెడ్ చిత్రమే “హరిహర వీరమల్లు”. నిధి అగర్వాల్ హీరోయిన్ గా దర్శకుడు జ్యోతికృష్ణ అలాగే క్రిష్ జాగర్లమూడి తెరకెక్కించిన ఈ చిత్రం రెండు భాగాలుగా ప్లాన్ చేయగా పార్ట్ 1 కి గాను “హరి హర వీరమల్లు పార్ట్ 1 – స్వార్డ్ వర్సెస్ స్పిరిట్” టైటిల్ తో ఇప్పుడు వచ్చింది. ఇక పార్ట్ 2 టైటిల్ ని మేకర్స్ థియేటర్స్ లోనే రివీల్ చేశారు.

దీనితో “హరిహర వీరమల్లు పార్ట్ 2 – బ్యాటిల్ ఫీల్డ్ తెలుగులో యుద్ధభూమి” గా అనౌన్స్ చేశారు. దీనితో హరిహర వీరమల్లు 2 ఈ టైటిల్ తో అలరించనుంది అని చెప్పాలి. ఇక ఈ చిత్రంలో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటించగా బాబీ డియోల్ విలన్ గా నటించారు. అలాగే ఎం ఎం కీరవాణి సాలిడ్ స్కోర్ అందించగా మెగా సూర్య ప్రొడక్షన్స్ పై ఏ దయాకరరావు భారీ బడ్జెట్ తో నిర్మాణం వహించారు.

Exit mobile version