రానా ప్రేమ గురించి తెలిసి షాకైన సురేష్ బాబు

రానా ప్రేమ గురించి తెలిసి షాకైన సురేష్ బాబు

Published on May 13, 2020 3:01 PM IST

దగ్గుబాటి రానా సోషల్ మీడియా వేదికగా అందరికి బిగ్ షాక్ ఇచ్చారు. చడీచప్పుడూ లేకుండా తన ప్రేయసి..కాబోయే భార్యను పరిచయం చేశాడు. మిహికా బజాజ్ కి ప్రపోస్ చేయగా ఆమె ఒప్పుకుంది అని రానా చెప్పాడు. మరి సగటు అభిమానులకు ఈ విషయం ఇంత షాక్ ఇస్తే.. రానా కుటుంబ సభ్యలు ఎలా ఫీలై ఉంటారు అనే ఆసక్తి అందరికీ నెలకొని ఉంది. ఈ విషయాన్ని సురేష్ బాబుని అడుగగా, మొదటి విని షాక్ అయ్యాను అన్నారు. వారు చాలాకాలంగా మంచి స్నేహితులు అని తెలుసు… ఐతే ప్రేమ గురించి తెలియదు. అందుకే ముందు కొంచెం షాక్ అనిపించింది అన్నారు.

ఇక లాక్ డౌన్ కారణంగా ఎటువంటి పనులు లేక బోర్ ఫీలవుతున్న మాకు వీరి పెళ్లి కొంత పని కల్పించింది, వీరి పెళ్లి పనులు చూసుకోవాలి. లాక్ డౌన్ ముగిసిన వెంటనే డిసెంబర్ కి ముందే వీరి వివాహం ఉంటుందని సురేష్ బాబు తెలియజేశారు. కాబట్టి ఈ ప్రేమ జంట పెళ్లి పీటలు ఎక్కడానికి ఎంతో సమయం లేదు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు