పెళ్లంటే నో అంటున్న స్టార్ హీరోయిన్

హీరోయిన్ సాయి పల్లవి తన పెళ్లి వార్తలపై స్పందించారు. అలాగే పెళ్లిపై ఓ ఆసక్తికర అభిప్రాయాన్ని చెప్పుకొచ్చారు. కొద్దిరోజులుగా త్వరలో సాయి పల్లవి పెళ్లి చేసుకోబోతుందని వరుస కథనాలు మీడియాలో వచ్చాయి. తాజా ఇంటర్వ్యూ లో ఇదే విషయం సాయి పల్లవిని అడుగగా, ఇప్పట్లో పెళ్లి చేసుకొనే ఆలోచన లేదు. నా ఫోకస్ మొత్తం కెరీర్ పైనే ఉంది. ఇంకా గట్టిగా చెప్పాలంటే అసలు పెళ్లి చేసుకుంటానో లేదో కూడా తెలియదు అని షాక్ ఇచ్చింది.

హీరోయిన్స్ లో ప్రత్యేకమైన భావజాలం కలిగిన సాయి పల్లవి అన్నంత పని చేసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ అమ్మడు డబ్బుల కోసం ఎలాంటి పాత్రనైనా చేయదు. కోట్లు కుమ్మరించినా యాడ్స్ లో నటించదు. తన సిద్ధాంతాలు పక్కన పెట్టి నడుచుకోదు. మరి ఇలాంటి లక్షణాలున్న సాయి పల్లవి, పెళ్లి విషయంలో వెళ్లబుచ్చిన అభిప్రాయం సంచలనంగా మారింది.

ఇక సాయి పల్లవి తెలుగులో విరాట పర్వం 1992 మరియు లవ్ స్టోరీ చిత్రాలలో నటిస్తుంది. ఈ రెండు చిత్రాల చిత్రీకణ చివరి దశకు చేరింది. లాక్ డౌన్ అనంతరం లవ్ స్టోరీ విడుదల కానుంది.

Exit mobile version