ఇవాళ నా పెళ్ళికొడుకు ఫంక్షన్- నితిన్

బీష్మ సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్న నితిన్ ని కరోనా వైరస్ గట్టిదెబ్బే వేసింది. భీష్మ సినిమా వసూళ్లకు గండికొట్టడంతో పాటు, పెళ్ళి కూడా వాయిదా పడేలా చేసింది. భీష్మ సక్సెస్ రన్ కొనసాగుతున్న సమయంలోనే కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టే కార్యక్రమంలో భాగంగా సినిమా థియేటర్స్ బంద్ ప్రకటించడం జరిగింది. ఈనెలలో నితిన్ పెళ్లి దుబాయ్ లో జరగాల్సివుంది. ఇక లాక్ డౌన్ కారణంగా ఇంటికే పరిమితమైన నితిన్ ని ఓ ఇంటర్వ్యూ లో ఈ సిట్యువేషన్ పై స్పందన తెలుపమని కోరగా, ఆయన ఆసక్తికర సమాధానం చెప్పారు.

ఏప్రిల్ 12 ఆదివారం నా పెళ్లికొడుకు ఫంక్షన్ జరగాల్సింది. ఆ వెంటనే దుబాయ్ ప్రయాణం చేయాల్సింది, కరోనా అంతటిని మార్చి వేసింది. జీవితంలో అతిముఖ్యమైన పెళ్లి ఘట్టం వాయిదాపడింది అన్నారు. భీష్మ చిత్రాన్ని థియేటర్ లో రెండు సార్లు చూశాను. మూడోసారి చూద్దాం అనుకొనే సమయానికి లాక్ డౌన్ మొదలైంది. ఇక భీష్మ ఏప్రిల్ 27న డిజిటల్ ప్లాట్ ఫార్మ్ లో విడుదల కానుంది. ఈ సినిమాను థియేటర్ లో మిస్సైన వారందరు డిజిటల్ ప్లాట్ ఫార్మ్ లో చూడడానికి సిద్ధంగా ఉన్నారు, అని అన్నారు.

Exit mobile version