“కేజీయఫ్” ఫ్యాన్స్ లో వీళ్ళకి నిరాశ తప్పదా..?

“కేజీయఫ్” ఫ్యాన్స్ లో వీళ్ళకి నిరాశ తప్పదా..?

Published on Jan 1, 2021 9:00 AM IST

ఇప్పుడు మన దక్షిణాది నుంచి వస్తున్న బిగ్గెస్ట్ పాన్ ఇండియన్ చిత్రాల్లో “కేజీయఫ్ చాప్టర్ 2” కూడా ఒకటి. కన్నడ రాకింగ్ స్టార్ యష్ హీరోగా శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న ఈ చిత్రంపై తారా స్థాయి అంచనాలు నెలకొన్నాయి. మరి ఈ సినిమా విడుదలకు ముందు ఈ భారీ యాక్షన్ థ్రిల్లర్ నుంచి టీజర్ అనౌన్స్మెంట్ వచ్చింది.

ఈ జనవరి 8 న యష్ బర్త్ డే సందర్భంగా విడుదలకు ప్లాన్ చేసారు. మరి ఈ సినిమా పాన్ ఇండియన్ ప్రాజెక్ట్ కాబట్టి అన్ని భాషల వారు ఎదురు చూస్తున్నారు. కానీ మేకర్స్ మాత్రం కేవలం కన్నడ టీజర్ ను మాత్రమే విడుదల చేయనున్నారని ఆ మధ్య టాక్ వచ్చింది. మరి ఇప్పుడు దీనిపై మరింత క్లారిటీ వినిపిస్తుంది.

ఈ టీజర్ ను మేకర్స్ కేవలం సింగిల్ లాంగ్వేజ్ లో నిర్మాణ సంస్థ హోంబేల్ యూట్యూబ్ ఛానెల్ నుంచి రావడం ఖాయం అయ్యిందట. మరి ఇదే కనుక జరిగితే ఈ మోస్ట్ అవైటెడ్ టీజర్ కోసం ఎంతగానో ఎదురు చూస్తున్న ఇతర ఇండస్ట్రీ అభిమానులకు కాస్త నిరాశే అని చెప్పాలి. మరి ఆరోజు ఏం జరగనుందో చూడాలి.

తాజా వార్తలు