ప్రస్తుతం నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా తన ఆల్ టైం దర్శకుడు బోయపాటి శ్రీనుతో ఒక పవర్ ప్యాకెడ్ సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. “సింహా”, “లెజెండ్” లాంటి మాస్ అండ్ ఎమోషనల్ డ్రామాలను అందించిన బోయపాటి బాలయ్యతో చేయనున్న ఈ హ్యాట్రిక్ చిత్రంపై కూడా అంతకు మించిన స్థాయిలోనే అంచనాలు ఏర్పర్చుకున్న వారయ్యారు.
దీనితో ప్రతీ అంశంలోనూ కేర్ తీసుకుంటున్న బోయపాటి ఈ చిత్రంలో ఒక కీలక రోల్ కు గాను ఓ ప్రముఖ నటిని తీసుకోనున్నారని విరివిగా టాక్ వినిపిస్తుంది. ఇంతకీ ఆ నటి మరెవరో కాదు హీరోయిన్ పూర్ణ అట. ఆ మధ్య కాలంలో వరుస తెలుగు సినిమాలతో బిజీగా గడిపి విరామం తీసుకున్న ఈ టాలెంటెడ్ నటి ఇప్పుడు మరోసారి టాలీవుడ్ లో బిజీగా మారింది. అలా ఇప్పుడు బాలయ్య అండ్ బోయపాటి ల సెన్సేషనల్ ఒక కీలక పాత్రను చేసే అవకాశాన్ని దక్కించుకుంది. మరి బోయపాటి ఆమెకు ఎలాంటి రోల్ ఇచ్చారో చూడాలి.