మెగాస్టార్ సినిమాలో ఫేడ్ అవుట్ అయిన ఈ స్టార్ హీరోయిన్.?

మెగాస్టార్ సినిమాలో ఫేడ్ అవుట్ అయిన ఈ స్టార్ హీరోయిన్.?

Published on Dec 22, 2020 10:30 PM IST

ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి హీరోగా బ్లాక్ బస్టర్ దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో “ఆచార్య” అనే చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. అలాగే మరోపక్క దీనితో పాటుగా ఓ రెండు రీమేక్ చిత్రాలు కూడా టేకప్ చేసిన విషయం కూడా అందరికీ తెలిసిందే. అయితే వాటిలో ఒకటి “వేదాళం” రీమేక్ కాగా మరొకటి “లూసిఫర్”.

అయితే వేదాళం కు రూట్ అంతా క్లియర్ గా ఉన్నా లూసిఫర్ సినిమాకు మాత్రం చాలానే రచ్చ నడిచి లాస్ట్ కి టాలెంటెడ్ దర్శకుడు మోహన్ రాజా వద్దకు చేరింది. అయితే ఈ చిత్రంలో ఇప్పుడు ఫేడ్ అవుట్ అవుతున్న స్టార్ హీరోయిన్ ను తీసుకొన్నారని బజ్ వినిపిస్తుంది. ఆమె మరెవరో కాదు ఇలియానానే.

ఈ స్టార్ హీరోయిన్ ఒకప్పుడు టాలీవుడ్ ను ఒక ఊపు ఊపింది. కానీ మెల్లగా ఫేడ్ అవుట్ అయ్యింది. మధ్యలో కొన్ని సినిమాలు చేసిన అవి కూడా వర్కౌట్ కాలేదు. మరి ఈ చిత్రంలో నిజంగానే ఇలియానా ఉందో లేదో దీనిపై ఇంకా అధికారిక సమాచారం రావాల్సి ఉంది.

తాజా వార్తలు