మొత్తానికి “బిగ్ బాస్” హౌస్ లో ఇదొక గుడ్ డే అనుకోవచ్చా?

మన తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో అయినటువంటి బిగ్ బాస్ సీజన్ 4 ఇప్పటి వరకు ఓ రేంజ్ లో నడిచిన సంగతి చూస్తూనే ఉన్నాము. కానీ నిన్నటి ఒక్క ఎపిసోడ్ తో మాత్రం ఓ పక్క బిగ్ బాస్ హౌస్ లో మరియు షో ఫాలోవర్స్ లో కూడా మంచి ఆనందదాయక వాతావరణమే నెలకొంది అని చెప్పాలి.

ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ తాలూకా తల్లులను పంపడంతో ఒక్కసారిగా పాజిటివ్ వైబ్స్ నెలకొన్నాయి. కంటెస్టెంట్స్ లో కూడా మంచి సందడి వాతావరణం నెలకొనడంతో ఇన్నాళ్లు గొడవలతో గ్రూపులుగా ఉన్న వారంతా కూడా ఒక్కసారిగా కలిసి మెలసి కబుర్లు చెప్పుకోడం మొదలు పెట్టారు.

ఇది మాత్రం మంచి పరిణామమే అని చెప్పాలి. ఈ విజువల్స్ చూసి కూడా ఇతర కంటెస్టెంట్ ల అభిమానులు కూడా ఈ ఒక్క ఎపిసోడ్ పట్ల చాలా హ్యాపీగా ఫీలవుతున్నారు. మొత్తానికి మాత్రం ఇన్ని రోజుల బిగ్ బాస్ 4 ఎపిసోడ్స్ లో ఇది ఒక మంచి ఎపిసోడ్ గా నిలుస్తుంది అని చెప్పొచ్చు. అయితే ఇదే ఎపిసోడ్ కనుక నాగ్ ఉన్నప్పుడు చేసి ఉంటే మరింత ఇంపాక్ట్ ఉండేది.

Exit mobile version