ఎన్టీఆర్ లిస్ట్ లో మరో టాలెంటెడ్ డైరెక్టర్ ?

ఎన్టీఆర్ లిస్ట్ లో మరో టాలెంటెడ్ డైరెక్టర్ ?

Published on Nov 16, 2020 4:20 PM IST

ఎన్టీఆర్ గత ఆరు సినిమాలుగా ప్లాప్ లేని స్టార్ హీరో. సినిమా సినిమాకి రేంజ్ పెంచుకుంటూ పాన్ ఇండియా స్థాయిలో స్టార్ గా మారబోతోన్న హీరో. అందుకే తారక్ సినిమాల సెలక్షన్ కూడా పాన్ ఇండియా రేంజ్ లోనే ఉంది. ఆర్ఆర్ఆర్ తరువాత తనకు వచ్చే పాన్ ఇండియా ఇమేజ్ ను దృష్టిలో పెట్టుకుని ఎన్టీఆర్ తన తరువాత సినిమాలను చాలా ప్లాన్డ్ గా ఫిక్స్ చేసుకుంటున్నాడు. ‘అయినను పోయి రావలె హస్తినకు’ అంటూ ఎన్టీఆర్ తో త్రివిక్రమ్ మంచి కమర్షియల్ పొలిటికల్ మూవీ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ సినిమా పై తారక్ ఫ్యాన్స్ తో పాటు సామాన్య ప్రేక్షకులకు కూడా బాగా ఆసక్తి నెలకొంది. పైగా ఈ సినిమాని పాన్ ఇండియా రేంజ్ లో ప్లాన్ చేయబోతున్న సంగతి తెలిసిందే.

అలాగే ఇప్పటికే కన్నడ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తో ఓ సినిమాకి కమిట్ అయ్యాడు. మరో టాలెంటెడ్ డైరెక్టర్ అట్లీతో కూడా ఓ సినిమా ప్లాన్ లో ఉన్నాడట తారక్. ఆ తరువాత మహానటి దర్శకుడు నాగ్ అశ్విన్ డైరెక్షన్ లోనూ ఓ సినిమా చేసే అలోచనలో ఎన్టీఆర్ ఉన్నాడట. ప్రస్తుతం నాగ్ అశ్విన్, ప్రభాస్ తో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తరువాత ఎన్టీఆర్ తోనే సినిమా అనుకుంటున్నాడట. ఏమైనా తారక్ ప్లానింగ్ పర్ఫెక్ట్ గా ఉంది. పైగా ఎన్టీఆర్ చూజ్ చేసుకున్న డైరెక్టర్స్.. ఆల్ రెడీ వాళ్ళకంటూ ఓ మార్కెట్ ఉంది. అది కూడా ఎన్టీఆర్ సినిమాలకు ఉపయోగపడుతుంది. ఇక త్రివిక్రమ్ ఎన్టీఆర్ తో చేస్తోన్న సినిమా వచ్చే ఏడాది మార్చి నుండి మొదలయ్యే అవకాశం ఉంది.

తాజా వార్తలు