“సర్కారు వారి పాట”పై క్రేజీ గాసిప్ అబద్దం.!

తెలుగు ఇండస్ట్రీలో మాములుగా ఓ మీడియం హీరో సినిమా వస్తుంది అంటేనే మంచి బజ్ నెలకొంటుంది. అలాంటిది ఓ స్టార్ హీరో సినిమా అంటే చాలానే వార్తలు వినిపిస్తుంటాయి. అయితే వాటిలో చాలా వరకు నిజాలు ఉంటాయి అలాగే కొన్ని ఊహలు కూడా ఉంటాయి.

అలా ఇప్పుడు లేటెస్ట్ గా టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా కీర్తి సురేష్ హీరోయిన్ గా పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కించనున్న చిత్రం “సర్కారు వారి పాట” సినిమాపై ఓ ఊహించని గాసిప్ భగ్గుమంది. అదే ఈ సినిమాలో ఓ పవర్ ఫుల్ రోల్ కోసం గాను స్వీటీ అనుష్కను తీసుకుంటున్నారని.

కానీ అసలు విషయంలోకి వెళ్తే అసలు ఇందులో ఎలాంటి నిజమూ లేదని అది ఫేక్ వార్త అని తేలింది. కేవలం అటెన్షన్ కోసమే కొందరు నెటిజన్స్ చేసే పిచ్చి పనులు వల్ల ఇతర ఫ్యాన్స్ హర్టవుతున్నారు. ఇదేమి కొత్త కాదు. ఇప్పటి వరకు చాలా సార్లు మన స్టార్ హీరోల సినిమాల విషయంలో సోషల్ మీడియాలో జరిగాయి.

Exit mobile version