కమల్-రజిని కాంబినేషన్ లో మూవీ..!

కమల్-రజిని కాంబినేషన్ లో మూవీ..!

Published on Jul 5, 2020 4:34 PM IST

తమిళ పరిశ్రమలో కమల్ హాసన్, రజిని కాంత్ లది ఘనమైన అధ్యాయం. ఈ ఇద్దరు హీరోలు ఒకే సమయంలో సినీ ప్రస్థానం మొదలుపెట్టి దేశం మెచ్చిన తారలుగా ఎదిగారు. కెరీర్ బిగినింగ్ లో వీరిద్దరూ కలిసి అనేక చిత్రాలలో నటించారు. ఇన్నేళ్ల తరువాత వీరి కాంబినేషన్ లో ఓ మూవీ రానుంది. ఐతే ఈ చిత్రంలో రజిని హరో కాగా కమల్ హాసన్ నిర్మాతగా ఉంటారట. కమల్ హాసన్ నిర్మాణ సంస్థ రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ పతాకంపై కమల్ ఈ చిత్రాన్ని నిర్మిస్తారట.

త్వరలో ఈ క్రేజీ ప్రాజెక్ట్ పై అధికారిక ప్రకటన రానుందని సమాచారం. ప్రస్తుతం కమల్, రజిని వారివారి చిత్రాలలో బిజీగా ఉన్నారు. దర్శకుడు శివతో రజిని అన్నాత్తే మూవీ చేస్తుండగా…కమల్ దర్శకుడు శంకర్ తో భారతీయుడు2 మూవీలో నటిస్తున్నాడు. మరి వచ్చే ఏడాది ఈ మూవీ సెట్స్ పైకి వెళ్లే సూచనలు కనిపిస్తున్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు